సంక్షోభాల్లోనే పొదుపు గుర్తుకు వస్తుందా?
సలాం ప్రొద్దుటూరు: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల దేశ ప్రజలను పొదుపు చర్యల్ని పాటించమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తో సహా మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని సూచనను శిరసావహిస్తూ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రధాని మోదీ మే 10న హైదరాబాదులో జరిగిన ఓ సభలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకోవాలని పిలుపునిస్తూనే... విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి బంగారం కొనుగోళ్ళను...