SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 12:18 pm Posted by : SALAM PRODDATUR

వైఎస్ఆర్సిపి కార్యకర్త తల్లి కి రాచమల్లు నివాళి..

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయితీ పరిధిలోని మత్స్య కాలనీ లో నివాసముండే వై.యస్.ఆర్.సి.పి కార్యకర్త తాజుద్దీన్  తల్లి బుధవారం మరణించింది . ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మత్స్య కాలని కు వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రాగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే తో పాటు వై.యస్.ఆర్.సి.పి కడప జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి ,ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ ,పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి  ఉన్నారు.