మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి కృషితో ఓనిపెంట గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్
– ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వాన సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు): మైదుకూరు నియోజకవర్గ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మైదుకూరు ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగా ఓనిపెంటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు నాణ్యమైన విద్యను అందుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి రావడం వల్ల...