SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 1:09 pm Posted by : SALAM PRODDATUR

మైదుకూరులో వెన్నుపోటుకు రెండేళ్లు –మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

సలాం ప్రొద్దుటూరు ( మైదుకూరు):

బుధవారం మైదుకూరు మున్సిపాలిటీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు నిరసన కార్యక్రమం జరిగింది. చంద్రబాబు  ప్రజలకు చేసిన వాగ్దానాలు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనారని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం అబ్జర్వర్ రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలు, నాయకులు నల్ల కండవాలు కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు.