పాపం.. పసికందును ముళ్ళ పొదల్లో వదిలేశారు
సలాం ప్రొద్దుటూరు (కడప ): –వినాయక నగర్ వద్ద చోటు చేసుకున్న దారుణ ఘటన.! కడప నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును ఎవరో తల్లిదండ్రులు ముళ్ళ పొదల్లో వదిలేసి పోయారు. కుక్కలు కొన్ని పసికందును ఎత్తుకెళ్తుండగా స్థానికులు గమనించి కుక్కను తరిమికొట్టారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు కొందరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.