SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 1:53 pm Posted by : SALAM PRODDATUR

దేశ దౌర్భాగ్యపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించాడు –కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్

 

 

సలాం ప్రొద్దుటూరు ( కడప):

 

దేశ దౌర్భాగ్యపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించాడనీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పేర్కొన్నారు.కడపలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రానంతరం భారత దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి చేసి, దేశ నిర్మాతగా ఖ్యాతి గడించారన్నారు.జవహర్లాల్ నెహ్రూ ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా కొనియాడారు.

ఇందుకు పూర్తి విరుద్ధంగా ఈవీఎంలు గోల్మాల్ చేసి, ఓట్లను దొంగలించి మోడీ ప్రధాని అయ్యాడని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనం చేశాడన్నారు. దేశ కరెన్సీ కి సంబంధించి రూపాయిని పూర్తిస్థాయిలో పతనం చేసిన అసమర్థ పాలకుడిగా మోడీ కి పేరు ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం తాండవమాడుతోందన్నారు. నీట్ పరీక్ష మొదలుకొని సీబీఎస్ఈ, పదవ తరగతి, యూజీ పరీక్షల పేపర్ లీక్ లతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేసిన దౌర్భాగ్యపు పాలకుడిగా ప్రజలు దూషిస్తున్నారు. అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మత విద్వేష పాలన చేస్తున్న నరేంద్ర మోడీ దేశంలో ముస్లింలను ఊచకోత కోసిన ఏకైక పాలకుడిగా చరిత్రహీనుడయ్యారన్నారు. హోం మంత్రి అమిత్ షా లాంటి రక్తపు మరకల నేరస్తుడితో ప్రజలను హింసిస్తున్నాడన్నారు. 12 ఏళ్లు దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. కానీ అదే 12 ఏళ్ల కాలంలో దేశాన్ని పూర్తిస్థాయిలో అమెరికా దేశానికి, అంబానీలకు తాకట్టు పెట్టిన మోడీ, సిగ్గుమాలిన పాలకుడన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపునకు బానిసగా మారి, దేశ సార్వభౌమాధికారాన్ని దాసోహం చేసిన దరిద్రపు పాలకుడిగా నరేంద్ర మోడీ చరిత్ర హీనుడయ్యారన్నారు. కేవలం మత విద్వేషపు అజెండాతో పాలిస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడన్నారు. అందువల్ల నరేంద్ర మోడీ కి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కి ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.