₹12 వేలు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి
సలాం ప్రొద్దుటూరు :
ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించేలా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి నెల రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందుతుంది. మొత్తం నాలుగేళ్ల పాటు ఈ ప్రయోజనం లభిస్తుంది.