SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 9:44 pm Posted by : SALAM PRODDATUR

పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలి –డి ఐ జి కోయ ప్రవీణ్

 

సలాం ప్రొద్దుటూరు ( కర్నూలు) :

 

పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.కర్నూలు రేంజ్ పరిధిలో ఇటీవల సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నుండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళ వారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఎస్‌ఐ నుండి సిఐలుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులను డీఐజీ ఈ సందర్భంగా అభినందించారు . పదోన్నతితో మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు.ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, చట్టబద్ధంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో మరింత చొరవ చూపాలని తెలిపారు.పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. సీఐలుగా పదోన్నతి పొంది డీఐజీ కలిసిన వారిలో… ఎ.పి. శ్రీనివాసులు, అరుణ్ రెడ్డి జీవన్ రెడ్డి , ముత్యాల శ్రీనివాసులు, ధనుంజయ,తిమ్మయ్య,లక్ష్మీనారాయణ,హనుమంతయ్య, లలిత ఉన్నారు.ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు కర్నూలు రేంజ్ డీఐజీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.