నటి సుకన్యకు సన్ టీవీ ₹10 లక్షలు చెల్లించాలి
సలాం ప్రొద్దుటూరు ( చెన్నై): గంధపు దుంగల స్మగ్లర్ వీరప్పన్ ఇంటర్వ్యూ వ్యవహారంలో సీనియర్ నటి సుకన్యకు సన్ టీవీ నెట్‌వర్క్ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్న కింది కోర్టు తీర్పును మద్రాసు హైకోర్టు సమర్థించింది. సన్ టీవీలో 1996లో ప్రసారమైన వీరప్పన్ ఇంటర్వ్యూ తన పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉందంటూ సుకన్య అప్పట్లో చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.