గోల్డ్ షాప్ ఓనర్లతో ఎ ఎస్పీ సమావేశం
సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని బంగారు దుకాణ యజమానులతో మంగళవారం పొద్దుటూరు ఏ ఎస్ పి విభూకృష్ణ సమావేశం నిర్వహించారు. బంగారు విక్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, చోరీల నివారణ గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సిఐలు టీవీ కొండారెడ్డి, వంశీనాథ్, ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.