ఖాకీ చాటున గంజాయి దందా.. కడపలో హోమ్ గార్డ్ అరెస్ట్

సలాం ప్రొద్దుటూరు (కడప): సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, తప్పుడు మార్గంలో వెళ్లేవారిని సన్మార్గంలో పెట్టాల్సిన ఒక హోమ్ గార్డ్, అత్యాశకు పోయి గంజాయి స్మగ్లర్‌గా మారిన ఉదంతం కడప జిల్లాలో వెలుగుచూసింది. విధి నిర్వహణలో ఉంటూనే కాకీ యూనిఫామ్ చాటున గుట్టుచాపుగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న హోమ్ గార్డును, అతని సహచరుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి కడపకు రవాణా పోలీసుల కథనం ప్రకారం... కడపలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన కటిగండ్ల రమేష్ బాబు కడప కమాండ్ కంట్రోల్‌లో...