SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 9:04 pm Posted by : SALAM PRODDATUR

అన్నీ తామై అంత్యక్రియలు – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

సలాం ప్రొద్దుటూరు:

అమృత నగర్ లో గంటశాల రామలక్షుమ్మ అనే వృద్ధురాలు మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి బందువులు ఎవరు ముందుకు రాకపోవడంతో స్థానికులు ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను మంగళవారం సంప్రదించారు. దీంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ వెంటనే  స్పందించి  హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్,సతీష్,కిరణ్ కుమార్ పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలని ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు.

82972 53484,9182244150.