సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరులోని వాసవి క్లబ్ ఎలీట్ ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జిరాఫీ చెస్ సమాఖ్య సహకారం తో జిరాఫీ చెస్ ఆట నందు వేసవి శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ తరగతులు మే 10 న ప్రారంభం మై జూన్ 10 న ముగిశాయి. శిక్షణ మగింపులో భాగంగా నిర్వహించిన జిరాఫీ చెస్ పోటీలో విజేతగా వి.లహరి, రన్నర్ అప్ గా వి. ముకుంద్ నిలిచారు. విజేతలకు ఈ నెల 10న గీతాశ్రమం వీధిలో గల పద్మశాలి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలను ట్రోఫీ అందజేయనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజా వెంకట వరలక్ష్మీ, సెక్రెటరీ పాలాది వెంకట స్వరూప్ కుమార్ తెలిపారు.
.