గోవాలో ఘోర పడవ ప్రమాదం.. 23 మంది మృతి..64 మంది గల్లంతు…

సలాం ప్రొద్దుటూరు: ధన వ్యామోహం, నిర్లక్ష్యం, మితిమీరిన ఉత్సాహం కలిపి సృష్టించిన మహా విషాదం.._ దేశాన్ని కలచివేసే విషాద ఘటన గోవాలో చోటుచేసుకుంది. పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది._ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించగా, 40 మందిని సురక్షితంగా రక్షించారు..మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి._సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను,...