₹ వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్): తెలంగాణలో సంచలనం సృష్టించిన గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. భూ అక్రమాల కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడి కోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, గండిపేట సర్వే నంబర్-18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ...