SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 4:55 am Posted by : SALAM PRODDATUR

సైకిల్‌ పై టీడీపీ నేత ముక్తియర్!

సలాం ప్రొద్దుటూరు:

ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన కార్యాలయం నుండి ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వరకు సైకిల్ పై వెళ్లారు. ఈ సందర్భంగా  మునిసిపల్ కమిషనర్  చిత్త రవిచంద్ర రెడ్డి కి స్థానికంగా ఉన్న  సమస్యలు డ్రైనేజీ, కాలువల శుభ్రత పై  చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గాంధీ రోడ్డులో వర్షపు నీరు నిలబడడంతో ప్రజలకు అనారోగ్యాలకు గురవుతూ అసౌకర్యం కలుగుతుందని అందువల్ల శాశ్వత పరిష్కారం చెయ్యాలని కమిషనర్ రవిచంద్ర రెడ్డి కీ వినతిపత్రం అందజేశారు. ఈ సైకిల్ ర్యాలీ వల్ల కాలుష్యాన్ని కాపాడొచ్చు అన్నారు. పర్యావరణ సమతుల్యత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం అని అదేవిధంగా ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ ఉపాధ్యక్షుడు ఖలీల్, పవన్, నీలాపురం భాషా, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.