సర్వాయపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

సలాం ప్రొద్దుటూరు( మైదుకూరు ): మైదుకూరు మండలంలోని బద్వేలు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై సర్వాయపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడపకు చెందిన అబ్దుల్ (18) డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పైలెట్ వీరబ్రహ్మం, ఈఎంటీ హర్షవర్ధన్ వేగంగా స్పందించి బాధితుడికి సకాలంలో సహాయం అందించారు.