ప్రొద్దుటూరు గృహనిర్మాణ శాఖ గోడౌన్ లో ఐరన్ మాయం..
–ప్రొద్దుటూరులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు సలాం ప్రొద్దుటూరు: పట్టణంలో ప్రొద్దుటూరు గృహనిర్మాణ శాఖ గోడౌన్ లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో ఐరన్ గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖకు అందిన ఫిర్యాదుల మేరకు విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు శనివారం ప్రొద్దుటూరులోని హౌసింగ్ గోడౌన్లను తనిఖీ చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న ఇళ్ల పథకం కింద ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 24 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో దాదాపు 15 వేల మందికి...