నీటి గుంతలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి
సలాం ప్రొద్దుటూరు (ఖాజీపేట): ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వనం సంజన (18), వనం అర్చన (14) అనే అక్కాచెల్లెళ్లు నీటి గుంతలో పడి మృతి చెందారు. పందుల పెంపకమే జీవనాధారంగా ఉన్న వీరు ప్రతిరోజులాగే తమ తల్లి శివవాణి, తమ్ముళ్లు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి పందులను మేపేందుకు గ్రామ శివారులోని నీటి గుంత వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సంజన, అర్చన నీటి గుంతలో పడి మునిగిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు...