టీడీపీ అధికారంలో వచ్చాక  శాంతి భద్రతలు క్షీణించాయి–మాజీ ఎమ్మెల్యే రాచమల్లు  

సలాం ప్రొద్దుటూరు : టిడిపి అధికారంలో వచ్చాక  శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దొరసానిపల్లెలోని ఆయన నివాసంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. ఇటీవల ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో టిడిపి వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని అన్నారు....