జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
సలాం ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అలాగే తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా...