జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు.. రేపే నామినేషన్

సలాం ప్రొద్దుటూరు (అమరావతి ): ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన సాయంత్రం వెలువడే అవకాశం ఉండగా, రేపు మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ, లింగమనేని రమేష్‌కు 2015 నుంచే జనసేన పార్టీతో అనుబంధం...