చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఆగడాలు శ్రుతి మించితే వదిలిపెట్టం తప్పు చేసిన సొంత నేతలకూ నో ప్లేస్

సలాం ప్రొద్దుటూరు : ప్రతిపక్ష పార్టీ శ్రేణులు తమ ఆగడాలను శ్రుతి మించకుండా చూసుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జిల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే సాధారణ కార్యకర్తలను సైతం భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దేందుకే ఈ విధమైన ప్రత్యేక శిక్షణా...