కేవలం క్రిమినల్ కేసు ఉందని..పాస్‌పోర్ట్‌ను ఆపలేరు –తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్): పాస్‌పోర్ట్ జారీ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, ఆ కారణంతో పాస్‌పోర్ట్ దరఖాస్తును తిరస్కరించడం లేదా నిలిపివేయడం చెల్లదని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లడం అనేది భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, తగిన కారణం లేకుండా దీన్ని నిరోధించలేమని న్యాయస్థానం పేర్కొంది. కేవలం ఎఫ్.ఐ.ఆర్ నమోదైనంత మాత్రాన దరఖాస్తుదారుడిని నేరస్తుడిగా పరిగణించలేమని, విచారణ దశలో ఉన్న...