SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:16 pm Posted by : SALAM PRODDATUR

ఎరువులు,యూరియా కొరత పై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తా – ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి 

సలాం ప్రొద్దుటూరు : 

ఎరువులు, యూరియా కొరత పై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. శనివారం స్థానిక నెహ్రూ రోడ్డు లోని ఆయన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ఎరువులు, యూరియా కొరత వుందంటూ రైతుల్లో ఆందోళన నెలకొన్నదని, ఈ నేపథ్యంలో విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, పరిస్థితి చక్కదిద్దేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా చూస్తామన్నారు. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువులు, యూరియా నిల్వలు వుండేలా చూస్తామని తెలిపారు. అదే విధంగా పట్టణంలో పలువురు మెడికల్ షాప్ లు, ఆర్ఎంపీ డాక్టర్లు, పలు ప్రవేట్ స్కూళ్ల పై ఫిటిషన్లు పెట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారని తన దృష్టికి తెచ్చారని, ఆ సమయంలో తనను కానీ పోలీసులను కానీ సంప్రదించాలని వివరించారు. కనీసం వారు మిగిలిన వారి సభ్యులను పిలిచి ఐక్యంగా సమస్య పరిష్కరించుకోనే ప్రయత్నం చేసి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇటువంటి వారిని ఒకరిద్దరిని రిమాండ్ కు పంపితే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. మీడియా సహకారం వుంటే ఇటువంటి చర్యలు 50 శాతం వరకు తగ్గించవచ్చని, పునరావృతం కాకుండా చూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, కడప జిల్లా టిడిపి అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.