SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 12:12 pm Posted by : SALAM PRODDATUR

80 విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలి–ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు (రాజుపాలెం):

రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవలె వచ్చిన గాలివానల కారణంగా పడిపోయిన 80 విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్దించాలన్నారు.రాజుపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీడీవో కు చెప్పారు.మైలవరం కాలువల ఆయకట్టు పరిధిలో మెయింటనెన్స్ మరియు శెట్టర్ రిపేర్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో MPDO సురేష్ బాబు ,MRO హరినాథ్ రెడ్డి ,మండల స్థాయి అధికారులు,నాయకులు పాల్గొన్నారు.