సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్):
హైదరాబాద్ సిటీ శుక్రవారం మౌర్య ఫంక్షన్ హాల్లో సినీనటి ముమైత్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా బ్యూటీ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. సౌత్ ఇండియా బ్యూటీషియన్ కాంపిటీషన్లో హెయిర్ అండ్ బ్యూటీషియన్ పోటీలలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన హర్షిత బ్యూటీ పార్లర్ ప్రోప్రైటర్ అండ్ బ్యూటిషియన్ రాధ కు మొదటి స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గా హాజరైన సినీనటి పాయల్ రాజ్ పుత్, గాయకుడు రోల్ రిడా,నటి నందిని,మాలతి శెట్టి చేతుల మీదుగా రాధ కు అవార్డు అందించారు. సౌత్ ఇండియా బ్యూటిషన్ పోటీలలో తాను మొదటి స్థానం గెలుచుకోవడం గర్వంగా ఉందని హర్షిత బ్యూటీ పార్లర్ ప్రొప్రైటర్ అండ్ బ్యూటీషియన్ రాధ చెప్పారు. భవిష్యత్తులో హర్షిత బ్యూటీ పార్లర్ ద్వారా మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ఈ బ్యూటిషన్ కోర్స్ నేర్పించి,సమాజంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.