SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:34 am Posted by : SALAM PRODDATUR

నర్సులా ..వైద్యులా ?

 

సలాం ప్రొద్దుటూరు (నాయుడుపేట):

ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ వైద్య సేవలపై సెంటర్లో రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత అనారోగ్య సమస్యలు లేదా ప్రమాదాల కారణంగా ఆసుపత్రికి రోగులకు వైద్యులు వచ్చే అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు విధి సమయంలో ఆసుపత్రి వెలుపల కనిపిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. డాక్టర్ల కోసం ఆరా తీస్తే ఇప్పుడే భోజనానికి వెళ్లారు అనే సమాధానమే హాస్పిటల్ సిబ్బంది నుండి తరచూ వినిపిస్తోందని రోగులు వాపోతున్నారు. భోజన విరామం పేరుతో కొందరు వైద్యులు ఎక్కువ సమయం బయట గడుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నర్సులే ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేషంట్ల భంధువులు తెలుపుతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల హాజరు, సేవలపై సమర్థ పర్యవేక్షణ లేదనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడిన వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు సైతం డిమాండ్ చేస్తున్నారు.