SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:42 am Posted by : SALAM PRODDATUR

డీఎస్సీ స్పోర్ట్స్ కోటపై సమగ్ర విచారణ జరపాలి.

– DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్.

సలాం ప్రొద్దుటూరు:

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో నియామకం జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని DYFI జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ప్రకటనలో డిమాండ్ చేశారు.    ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఈ రెండు సంవత్సరాలలో ఒక డీఎస్సీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నారు.నిరుద్యోగ భృతి హామీ పూర్తిగా అమలు కాలేదు అన్నారు.ఖాళీగా ఉన్న 42 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో కేవలం 16 వేల ఉద్యోగాలకు మాత్రమే డీఎస్సీ ప్రకటించడం వల్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నారు.అనేక వివాదాలు కోర్టు కేసులు నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి అర్హుల జాబితా ప్రకటించారన్నారు. అయితే స్పోర్ట్స్ కోటా ఎంపికలు అనేక అక్రమాలు జరిగినట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయన్నారు.వీటిపై ప్రభుత్వం ఇస్తున్న వివరణ మరిన్ని సందేహాలకు కారణమైందన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేసిన అభ్యర్థులు కొందరిని తొలగించి వారి స్థానంలో స్పోర్ట్స్ కోటా పేరుతో మరి కొంతమందిని ఎంపిక చేసిన విధానం పలు అనుమానాలకు తావిస్తున్నది అన్నారు. కొందరు అక్రమాలకు పాల్పడి స్పోర్ట్స్ కోటా ల

పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని విమర్శలు వస్తున్నాయన్నారు.కావున రాష్ట్ర ప్రభుత్వం వీటిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించడంతో పాటు అర్హులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామన్నారు.