91 మంది ఖైదీలకు క్షమాభిక్ష..

సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. ఖైదీలు ఇవాళ జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా వెల్లడించారు. విడుదలవుతున్న ఖైదీలు సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, మళ్లీ జైలు బాట పట్టకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆమె సూచించారు.విడుదల అవుతున్న వారిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 38 మంది జైళ్ల శాఖ ఆధ్వర్యంలో...