జూన్ 19న తల్లికి వందనం నిధులు జమ
సలాం ప్రొద్దుటూరు : ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం (Talliki Vandanam) డబ్బుల్ని ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో జమ చేయాల్సి ఉంది.ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హుల వివరాలను క్షేత్రస్దాయిలో పరిశీలించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుండటంతో డబ్బుల జమ తేదీ మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఓసారి చూద్దాం..ఈసారి వేసవి సెలవుల తర్వాత కొత్త విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కాబోతోంది. అదే...