SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:36 pm Posted by : SALAM PRODDATUR

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు

 

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1387 వ (50వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…

 

*వ్యవసాయం & సహకారం*

 

*1.వ్యవసాయం & సహకార శాఖ:*

చిత్తూరు జిల్లా G.D. నెల్లూరు మండలం చిన్నవేపంజరి రెవెన్యూ గ్రామంలో మహాదేవమంగళం సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్‌లో LPM No.159లో వ్యవసాయ శాఖకు చెందిన 46.69 ఎకరాల భూమిని PM-KUSUM పథకంలోని ఫీడర్ లెవల్ సోలారైజేషన్ (FLS) భాగం కింద సోలార్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం NREDCAP కు 30 సంవత్సరాల లీజుకు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. లీజు అద్దె నిర్ణయం మరియు అగ్రిమెంట్ అమలుకు అనుమతి ఇచ్చింది.

 

 

*సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్:*

 

*2. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ:*

అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ITE&C శాఖకు APCRDA కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలు మరియు ఇతర వర్తించే చార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం APCRDA కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీ మరియు ఇతర ఫీజుల మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక, పరిపాలన మరియు ప్రజా ప్రయోజన పరంగా గణనీయమైన లాభాలు కలుగుతాయి.

 

APCRDA మరియు ITE&C శాఖలు రెండూ ప్రభుత్వ సంస్థలే కావడంతో, సుమారు ₹5.53 కోట్ల ఫీజుల చెల్లింపు అనేది ప్రభుత్వంలో అంతర్గత లావాదేవీగానే మిగిలిపోతుంది. మినహాయింపు ద్వారా ఈ అనవసర ఆర్థిక భారం తప్పి, ఆదా అయిన నిధులను నేరుగా క్వాంటం వ్యాలీ నిర్మాణం, పరిశోధన మరియు ఆవిష్కరణల అభివృద్ధికి వినియోగించే అవకాశం లభిస్తుంది.

 

అలాగే, పరిపాలనాపరమైన ఆలస్యాలు తగ్గి, ప్రాజెక్టు వేగవంతంగా అమలుకు దోహదపడుతుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వాణిజ్య లక్ష్యాలకు కాకుండా పరిశోధన, సాంకేతికత మరియు పరిశ్రమల పురోగతికి ఈ భూమి వినియోగించబడుతున్న నేపథ్యంలో, ఈ మినహాయింపు పరిపాలనా పరంగా సముచితమైనదిగా, గత ప్రభుత్వ విధానాలకు అనుగుణమైనదిగా భావించవచ్చు.

 

*ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం:*

 

*3. ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమ శాఖ:*

వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన మేరకు, రాష్ట్రంలో అవయవ దానం మరియు మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్, 2011 (THOTA 2011 – Act No.16 of 2011)’ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు 12.03.2026 నుండి వాయిదా పడిన కారణంగా, దీనిని ‘ద ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2026’ పేరుతో ఒక ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయనున్నారు.

 

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవ దానం ఆయుష్షును పెంచి ఎంతో మేలు చేస్తున్నప్పటికీ, మరోవైపు బలహీన వర్గాలను ప్రలోభపెట్టి, మోసగించి అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కఠిన చట్టం అమలు అత్యవసరంగా మారింది. వాస్తవానికి 1994లో తెచ్చిన చట్టానికి 2011లో కేంద్రం సవరణలు చేసి అవయవాలతో పాటు కణజాలాలను కూడా దీని పరిధిలోకి చేర్చగా, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ చట్టాన్ని ఆమోదించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాలు (కర్ణాటక, మేఘాలయ, తెలంగాణ, ఉత్తరాఖండ్) దీనిని ఇంకా అమలు చేయకపోవడంతో, ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (WP Civil No. 39 of 2025) కేసులో సుప్రీంకోర్టు 2025 నవంబర్ 19న ఇచ్చిన తీర్పులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తక్షణమే THOTA 2011ని ఆమోదించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా మరియు రాష్ట్రంలో అవయవాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టి, వైద్యపరమైన మార్పిడి విధానాల్లో పారదర్శకతను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

*రెవెన్యూ (ఎక్సైజ్)*

 

4. రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ:

ఆంధ్రప్రదేశ్‌లో బీచ్ షాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మొదటి దశలో చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట రెండేసి షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి, పైలట్ ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.

 

*జలవనరుల అభివృద్ధి*

 

*5. జలవనరుల అభివృద్ధి శాఖ:*

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్యాకేజ్ నం.5 & 5Aకు సవరించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రూ.796.66 కోట్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇవి KM 93.700 నుండి KM 111.000 వరకు మెయిన్ కెనాల్ తవ్వకం, గట్ల నిర్మాణం, కెనాల్ లైనింగ్ మరియు CM & CD పనులు. ఇంతకు ముందు మంజూరైన టెక్నికల్ శాంక్షన్ రూ.352.60 కోట్లకు బదులుగా ఈ నూతన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆమోదించడం జరిగింది.

 

*6. జలవనరుల అభివృద్ధి:*

బాపట్ల జిల్లాలో కుందేరు డ్రెయిన్‌ను KM 11.300 నుండి KM 18.950 వరకు తవ్వకం పనులను రూ.517.50 లక్షలతో నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. “MH4700 COL on M &MI (01) MI – MH(136) KDS – GH(11) SDS – SH(27) -530/531” Head of Account కింద ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది.

 

*న్యాయ శాఖ (కోర్టులు)*

 

*7. న్యాయ శాఖ (కోర్టులు):*

AP ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (APPDFE) యాక్ట్, 1999 మరియు అగ్రి గోల్డ్ కేసులు పరిష్కరించడానికి 21 పోస్టులు మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

న్యాయ శాఖ (కోర్టులు) ప్రతిపాదన మేరకు, AP ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (APPDFE) యాక్ట్-1999 కింద నమోదైన కేసులతో పాటు ప్రత్యేకించి అగ్రిగోల్డ్ (Agri Gold) కేసుల సత్వర విచారణ మరియు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త పరిధిలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు 21 నూతన పోస్టులను మంజూరు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

గతంలో 15.12.2016న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Ms.No.134) ప్రకారం ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, దానికి అవసరమైన సిబ్బంది నియామకం పెండింగ్‌లో ఉంది. ఈ కేసులను, ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా ఈ కోర్టును తక్షణమే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) మరియు సీఐడీ డీజీపీ (DGP, CID) చేసిన అభ్యర్థనల మేరకు స్పందించిన ప్రభుత్వం, సవరించిన పే స్కేల్స్ (RPS 2022) ప్రకారం ఈ 21 పోస్టుల నియామకానికి మరియు కోర్టు నిర్వహణకు అయ్యే ఇతర ఖర్చులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

పురపాలక & పట్టణాభివృద్ధి

 

*8. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:*

కృష్ణా నది ఒడ్డున దాదాపు 6.00 ఎకరాల (5.00 ఎకరాలు + 1.00 ఎకరం) APCRDA భూమిపై 30 సంవత్సరాల కన్సెషన్ కాలానికి Design, Build, Finance, Operate and Transfer (DBFOT) పద్ధతిలో “అమరావతి ఐ” అభివృద్ధి కోసం కాంపిటేటివ్ టెండర్లు / RFP ఆహ్వానించడానికి MD, AGICL కు అనుమతి ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

“అమరావతి ఐ” అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోతున్న ఒక Giant Observation Wheel వంటి ప్రాజెక్టు. లండన్‌లోని ప్రసిద్ధ ‘లండన్ ఐ’ తరహాలో దీనిని కృష్ణా నది తీరాన నిర్మించడానికి సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఈ భారీ చక్రం పైకి వెళ్లినప్పుడు పర్యాటకులు అందులో కూర్చుని అమరావతి నగరాన్ని, నది అందాలను చుట్టూ ఉన్న పరిసరాలను చాలా ఎత్తు నుండి స్పష్టంగా చూడవచ్చు. ఇది మన రాజధానిలో పర్యాటకాన్ని పెంచడానికి మరియు పర్యాటకులను ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది.

 

*9. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:*

రాజధాని అమరావతి నగరంలో అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ ‘F’లో హైకోర్టు భవనంలో రూఫ్ టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్‌స్టేషన్, జడ్జెస్ డ్రాప్-ఆఫ్ & ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు రూ.547,07,25,847/- అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. Design Build Lump Sum Contract (% Percentage Tender) System కింద టెండర్ ప్రక్రియ చేపట్టడానికి AGICL MD కు అనుమతి ఇచ్చింది.

 

*10. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:*

రాజధాని అమరావతి నగరంలో రాయపూడి గ్రామంలోని All India Services (ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు సెక్రెటరీ స్థాయి) భవనాలకు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అదనపు వార్డ్రోబ్లు, స్టోర్ రూమ్, జ్యూస్ కౌంటర్, స్పైరల్ స్టెయిర్‌కేస్, బాల్కనీ విత్ క్యానోపీ, కార్ పార్కింగ్ షెడ్, గ్లేజ్డ్ రెయిలింగ్స్, టెన్సైల్ రూఫింగ్, హీట్ పంప్స్, అదనపు HVAC, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు బాహ్య విద్యుత్ పనులకు L1 బిడ్డర్‌కు అంగీకార పత్రం జారీ చేయడానికి Commissioner, APCRDAకు అనుమతి ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ విలువ రూ.94,90,78,802.96/- (ECV రూ.90,48,32,494.00/-కు 4.89% అధికంగా). APCRDA అథారిటీ రెజల్యూషన్ నం.651/2026 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

*11. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:*

జి.ఓ.ఎంఎస్.నం.42, MA&UD (CRDA) శాఖ, తేదీ:27.02.2026 ద్వారా జారీ చేసిన Negotiated Settlement Policyకి సవరణ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది జి.ఓ.ఎంఎస్.నం.142, MA&UD (CRDA) శాఖ, తేదీ:29.07.2025; జి.ఓ.ఎంఎస్.నం.153, MA & UD (CRDA.2) శాఖ, తేదీ:19.04.2017 మరియు జి.ఓ.ఎంఎస్.నం.420, MA & UD (CRDA.2) శాఖ, తేదీ:31.12.2018 ఆధారంగా జరిగింది.

 

జి.ఓ.ఎంఎస్.నం.142, MA&UD (CRDA) శాఖ, తేదీ:29.07.2025; జి.ఓ.ఎంఎస్.నం.153, MA & UD (CRDA.2) శాఖ, తేదీ:19.04.2017 మరియు జి.ఓ.ఎంఎస్.నం.420, MA & UD (CRDA.2) శాఖ, తేదీ:31.12.2018 ఈ మూడింటినీ కలిపి జారీ చేసిన Negotiated Settlement Policy కి సవరణ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*పరిశ్రమలు & మౌలిక సదుపాయాలు:*

 

*12. పరిశ్రమలు & మౌలిక సదుపాయాల శాఖ:*

ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీ 2026 (2026-31)కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించారు. ఇంటిగ్రేటడ్ విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ పెంపు, కార్గో మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల విస్తరణ, MRO (Maintenance, Repair & Overhaul) మరియు ఏరోస్పేస్ తయారీ రంగాల్లో పోటీతత్వమైన వాతావరణం కల్పించడం, విమానయాన నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాల విస్తరణ మరియు అడ్వాన్స్డ ఎయిర్ మొబిలిటీ (AAM), సుస్థిర విమాన ఇంధనం (SAF) వంటి భవిష్యత్ సాంకేతిక అవకాశాలను అందిపచ్చుకోవడం వంటివి ఈ పాలసీ కింద చేపట్టనున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026-31 ద్వారా రాష్ట్రంలో విమానయాన రంగానికి భారీ ఊతం లభించనుంది. 2035 నాటికి ప్రయాణికుల సామర్థ్యాన్ని 6.2 మిలియన్ల నుంచి 30.38 మిలియన్లకు, ఎయిర్ కార్గోను 6,240 మెట్రిక్ టన్నుల నుంచి 4.27 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 150 కి.మీ పరిధిలో విమానాశ్రయ సౌకర్యం కల్పించనున్నారు.

 

ఈ పాలసీ ద్వారా ఎంఆర్ఓ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించడం, ప్రతి సంవత్సరం 5,000 మందికి శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపు, గ్రీన్ ఏవియేషన్ టెక్నాలజీలు మరియు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) అభివృద్ధికి ప్రోత్సాహం లభించనుంది. పెట్టుబడిదారులకు సబ్సిడీలు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, VGF, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోత్సాహకాలతో రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

 

*పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి*

 

*13. పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ:*

జూలై 1, 2026 నుండి ఆంధ్రప్రదేశ్‌లో ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామిన్) [VBGRAMG]’ యాక్ట్, 2025 అమలు చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ‘విక్సిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామిన్) [VB-GRAMG]’ పేరిట ఈ పథకం అమలు జరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40 ఆర్థిక వాటా ఉంటుంది.

 

విక్షిత్ భారత్–రోజ్‌గార్ మరియు అజీవిక మిషన్ (గ్రామీన్) అయిన విబి-జీ-రామ్ జీ పథకం గ్రామీణ శ్రామికులకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2025లో తీసుకొచ్చిన సంస్కరణాత్మక కార్యక్రమం. గతంలోని MGNREGAలో ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచడంతో ప్రతి గ్రామీణ కుటుంబానికి అదనంగా 25 రోజుల ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో రోజుకు సగటు కూలి రూ.307గా పరిగణిస్తే, ప్రతి కుటుంబానికి ఏడాదికి అదనంగా రూ.7,675 వరకు ఆదాయం పెరుగుతోంది.

 

ఈ పథకం ద్వారా పని పూర్తైన 7 రోజుల్లో వేతనాలు చెల్లించే విధానం అమలులోకి రాగా, 15 రోజులకు మించి ఆలస్యమైతే రోజుకు 0.05% వడ్డీతో చెల్లింపులు జరుగుతాయి. అలాగే 15 రోజుల్లో పని కల్పించలేకపోతే ఆటోమేటిక్‌గా నష్టపరిహారం అందించే నిబంధన గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఆదాయ భద్రతను కల్పిస్తోంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా పారదర్శకత పెరిగి, వేతనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గ్రామీణ పేదలు మరియు కూలీల జీవనోపాధిని బలోపేతం చేసే ప్రజాకేంద్రీకృత పథకంగా విబి-జీ-రామ్ జీ నిలుస్తోంది.

 

*రెవెన్యూ*

 

*14. రెవెన్యూ శాఖ:*

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సాతు గ్రామంలో Sy.No.83/2E లో LPM No.91లో 4.94 ఎకరాల ప్రభుత్వ భూమిని APIIC లిమిటెడ్‌కు ఇప్పటికే ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ విస్తరణ కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.12,38,930/- చొప్పున (మొత్తం భూమి ధర రూ.61,20,341/-) చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*15. రెవెన్యూ శాఖ:*

విశాఖపట్నం రూరల్ మండలం మాధురవాడ గ్రామంలో Sy.No.426/3లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విజయవాడకు స్టార్ హోటల్, రిసార్ట్లు లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం బదిలీ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.199,96,94,400/- (బేసిక్ విలువ) బుక్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా చెల్లింపు జరుగుతుంది. APTDC టూరిజం మరియు ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2024-29 నిబంధనల మేరకు డెవలపర్‌కు లీజు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది.

 

*16. రెవెన్యూ శాఖ:*

చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె మండలం గుడుపల్లె గ్రామంలో Sy.No.50/5లో 12.75 ఎకరాల ప్రభుత్వ భూమిని APIIC లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.12,00,000/- చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*17. రెవెన్యూ శాఖ:*

నెల్లూరు జిల్లా సీతరామపురం (M), పెదనాగంపల్లి (V)లో Sy.No.54-4లో 14.10 ఎకరాల (5.71 హెకర్లు) ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనం సంజీవ రెడ్డి సోమసిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ-I కింద సోమసిల రిజర్వాయర్ నుండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నం.4 వరకు కెనాల్ తవ్వకానికి వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్ మరియు బొమ్మవారం రిజర్వ్ ఫారెస్ట్ లోని 4.76 హెక్టార్ల అటవీ భూమికి పరిహారంగా ఈ భూమి అటవీ శాఖకు ఇవ్వడం జరుగుతుంది. మార్కట్ విలువ ఎకరాకు రూ.5,50,578/- చొప్పున మొత్తం 14.10 సెంట్లకు రూ.77,63,143/- చెల్లింపపై పరిహార వనీకరణ కోసం ఈ బదిలీ జరుగుతుంది.

 

*18. రెవెన్యూ శాఖ:*

చిత్తూరు జిల్లా V.కోట (M), తోటకనుమ (V)లో Sy.No.519/5లో 11.96 ఎకరాల ప్రభుత్వ భూమిని Hindustan Petroleum Corporation Limited చీఫ్ మేనేజర్‌కు ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ (HPCL) నిర్మాణం కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.8,00,000/- చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*19. రెవెన్యూ శాఖ:*

అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం, తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో Sy.No.608-10లో 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, అనకాపల్లికి జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 66 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జి.ఓ.ఎంఎస్.నం.340, Revenue (Assign.I) శాఖ, తేదీ:21.07.2016 మరియు జి.ఓ.ఎంఎస్.నం.282, Rev. (Lands-I) శాఖ, తేదీ:15.05.2026 మేరకు ఈ కేటాయింపు జరుగుతుంది.

 

*20. రెవెన్యూ శాఖ:*

కాకినాడ జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, వార్డ్ నం.1, బ్లాక్ నం.10, T.S.No.204/2లో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుకు TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 66 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున జి.ఓ.ఎంఎస్.నం.340, Revenue (Assign.I) శాఖ, తేదీ:21.07.2016 మరియు జి.ఓ.ఎంఎస్.నం.282, Revenue (Lands-I) శాఖ, తేదీ:15.05.2026 మేరకు కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మునిసిపల్ రెజల్యూషన్ సమర్పణ పెండింగ్‌లో ఉంది.

 

*21. రెవెన్యూ శాఖ:*

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం & గ్రామంలో LPM No.1101, Sy.Nos.241-3 & 241-5లో ఉన్న 25 ఎకరాల 37 సెంట్ల భూమి వర్గీకరణను 1906 నాటి RSR ప్రకారం నమోదైన ‘ట్యాంక్ పోరంబోకు’ నుండి ‘గ్రామ కంఠం / విలేజ్ సైట్ పోరంబోకు’గా మార్చడానికి, మిగిలిన 83 ఎకరాల 01 సెంట్లు ట్యాంక్ పోరంబోకుగా యథావిధిగా కొనసాగించడానికి, వేబ్‌ల్యాండ్ మరియు అనుబంధ డేటాబేసులతో సహా అన్ని సంబంధిత రెవెన్యూ రికార్డుల్లో తగు సవరణలు చేయడానికి, మరియు Registration Act, 1908 సెక్షన్ 22-A కింద నిర్వహించే నిషేధిత ఆస్తుల జాబితా నుండి పై 25 ఎకరాల 37 సెంట్లను తొలగించడానికి Collector & District Magistrate, గుంటూరుకు అనుమతి ఇచ్చిన జి.ఓ.ఎంఎస్.నం.314, Rev (Lands.V) శాఖ, తేదీ:29.05.2026 ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*22. రెవెన్యూ శాఖ:*

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కారగ్రహారం గ్రామంలో RS.No.28-5 (0.04 ఎకరాలు), 30-1 (0.30 ఎకరాలు), 251-1 (0.05 ఎకరాలు) మరియు 253-8 (0.19 ఎకరాలు), మొత్తం 0.58 ఎకరాల ప్రభుత్వ భూమిని AP మారిటైమ్ బోర్డుకు NH-216 నుండి మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ వరకు రోడ్డు & రైలు కనెక్టివిటీ అభివృద్ధి కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.43,27,000/- చొప్పున (మొత్తం 0.58 ఎకరాలకు రూ.25,09,660/-) చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*23. రెవెన్యూ శాఖ:*

కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ & నార్త్ మండలంలో R.S.No.371-A1B2లో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్, మచిలీపట్నంకు వారి రీజనల్ ఆఫీస్ భవనం నిర్మాణం మరియు ప్రాసెసింగ్ సెంటర్లు (MLP, RLP & ALP) కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో వార్షిక అద్దె రూ.1,25,23,500/- చొప్పున ప్రతి 5 సంవత్సరాల బ్లాక్‌కు 10% పెంపుతో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*ఇంధన శాఖ*

 

*24. ఇంధన శాఖ:*

HUDCO, విజయవాడ రీజనల్ ఆఫీస్ నుండి రూ.300 కోట్ల స్పెషల్ టర్మ్ లోన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడకు రూ.300 కోట్ల ప్రభుత్వ హామీ ఇవ్వడానికి మరియు గవర్నమెంట్ గ్యారంటీ డీడ్ అమలు చేయడానికి జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నం.49, Energy (Power.III) శాఖ, తేదీ:26.05.2026 ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. HUDCO రుణ వాయిదాలను సకాలంలో చెల్లించడానికి లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌కు రుణం బదిలీ చేయడం జరుగుతుంది.

 

*రెవెన్యూ*

 

*25. రెవెన్యూ శాఖ:*

YSR కడప జిల్లా బి.మట్టం మండలం పాలుగురళ్లపల్లి గ్రామంలో Sy.No.2385లో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఎకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NREDCAPకు లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*26. రెవెన్యూ శాఖ:*

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం & గ్రామంలో Sy.No.41-1, 42, 43-2, 52-2, 53-1, 57-1లో 11.80 ఎకరాల ప్రభుత్వ భూమిని APIIC, విజయవాడకు MSME పార్క్ అభివృద్ధి కోసం కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*27. రెవెన్యూ శాఖ:*

YSR కడప జిల్లా తొండూరు మండలం మల్లెల, తొండూరు, బుచ్చుపల్లి గ్రామాల్లో Sy.No.1243లో 70.04 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఆంప్లస్ IIFA సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 126 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NREDCAPకు లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*28. రెవెన్యూ శాఖ:*

YSR కడప జిల్లా B.మట్టం మండలం పాలుగురళ్లపల్లి మరియు పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో Sy.No.2369 లో 176.33 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఎకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NREDCAPకు లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*29. రెవెన్యూ శాఖ:*

YSR కడప జిల్లా ముద్దనూరు మండలం కోలవలి గ్రామంలో Sy.No.737-10లో 27.77 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఆంప్లస్ ఎవరెస్ట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 126 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NREDCAP కు లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*30. రెవెన్యూ శాఖ:*

YSR కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామంలో Sy.No.587-9లో 5.94 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఆంప్లస్ IIFA సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 126 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NREDCAPకు లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*31. రెవెన్యూ శాఖ:*

YSR కడప జిల్లా తొండూరు మండలం మల్లెల, బుచ్చుపల్లి గ్రామాల్లో Sy.No.60/2లో 207.31 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s ఆంప్లస్ IIFA సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 102.50 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం NREDCAPకు లీజు పద్ధతిలో కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*32. రెవెన్యూ శాఖ:*

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో తిమ్మాపురం మరియు దోనిముక్కల గ్రామాల్లో Sy.No.191-Bలో 33.00 ఎకరాల ప్రభుత్వ భూమిని M/s పవర్ గ్రిడ్ అనంతపురం కర్నూలు ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

*పురపాలక & పట్టణాభివృద్ధి:*

 

*33. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:*

CRDA ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపు కొత్త ప్రతిపాదనలపై మరియు పాత కేటాయింపుల సమీక్షపై మంత్రుల బృందం 26వ సమావేశం చేసిన సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. APCRDA అథారిటీ రెజల్యూషన్ నం.662/2026, తేదీ:30.05.2026 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ నిర్ణయంలో భాగంగా మొత్తం 13 ప్రతిపాదనలకు (మొత్తం 42.60 ఎకరాలకు సంబంధించి) క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, APHRDI, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం మరియు తెలుగు సాంస్కృతిక కేంద్రం వంటి సంస్థలకు భూకేటాయింపుల్లో సవరణలు/స్థల మార్పులు చేయడం; కిమ్స్ (KIMS), ఆదిత్య ఎడ్యుకేషన్ సొసైటీ, బీజేపీ పార్టీ కార్యాలయం తదితర సంస్థల కోసం భూవినియోగ మార్పిడికి (Change of Land Use) అనుమతించడం; నిబంధనలు ఉల్లంఘించిన లేదా ఆసక్తి చూపని GRT హోటల్స్, స్ప్లెండర్ ల్యాండ్‌బేస్ (తాజ్ జింజర్), IRCTC వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన కేటాయింపులను రద్దు చేయడం; మరియు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం APIIC కి 8 ఎకరాల కేటాయింపును నిర్ధారించడం వంటి కీలక అంశాలు ఈ సిఫార్సులలో ఉన్నాయి.

 

*ఉన్నత విద్య:*

 

*34. ఉన్నత విద్య శాఖ:*

ఉన్నత విద్యా శాఖ ప్రతిపాదన మేరకు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా శ్రీసిట