SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 9:35 pm Posted by : SALAM PRODDATUR

కుక్స్ సమావేశం విజయవంతం

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):

గురువారం రోజు కుక్స్ సమావేశం జిల్లా సైన్ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసి టి. శైలజ , జిసిడిఓకే.కవిత హాజరై వంట నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రత మరియు విద్యార్థుల సంతృప్తి వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో పాల్గొన్న వంటవారు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు, మెరుగైన సేవలందించడానికి అవసరమైన సూచనలు చేశారు. ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం, పరిశుభ్రమైన వంటశాల నిర్వహణ, మరియు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వంటకాలను సిద్ధం చేయడం పై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే, సిబ్బంది మధ్య సమన్వయం పెంపొందించడం, నూతన వంట విధానాలను అవలంబించడం, మరియు ఆహార వ్యర్థాలను తగ్గించే చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.