పులివెందుల : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలపై మాజీ మునిసిపల్ ఇంచార్జి వైయస్ మనోహర్ రెడ్డి , పులివెందుల పట్టణ వైకాపా కన్వీనర్ హాల్గం గాధర్ రెడ్డి మరియు వైసిపి నాయకులుపర్యటించారు.మంగళవారం జయమ్మ కాలనీ, అహోబిలాపురం లో డ్రైనేజీ మంచి నీటి సమస్యలపై ప్రజల నుండి పలు వినతి మేరకు స్వయంగా వార్డులోకి వెళ్లి పరిశీలించి మున్సిపల్ అధికారులకు తెలిపి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా వై ఎస్ మనోహరరెడ్డి మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామని,అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని, వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోడి రమణ, పులివెందుల పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ వైసిపి నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.