సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం కింద జరుగుతున్న నియోజకవర్గ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు శుక్రవారం హాజరైన రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ను స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ డా వి.ఎస్. ముక్తియార్ ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా డా. వి.ఎస్. ముక్తియార్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి పట్టాభిరామ్‌ను ఆత్మీయంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన పట్టాభిరామ్, పొద్దుటూరు చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని అలాగే నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.