ప్రాంతాల విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దు
సలాం ప్రొద్దుటూరు: ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని జమ్మలమడుగు జనసేన నాయకుడు నల్లంశెట్టి నాగార్జున పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాసనగర్ లోని జనసేన కార్యాలయం లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచి చేస్తామని ప్రజలను మరోసారి నమ్మించే ప్రయత్నం చేసుకోవాలన్నారు.విమర్శల కంటే ఆత్మపరిశీలన అవసరమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సూచించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ కోసం కాకినాడ వెళ్లాల్సిన అవసరం లేదని, కడప జిల్లాలోని జనసైనికులే సమాధానం చెబుతారని అన్నారు. జనసేన ప్రొద్దుటూరు నాయకుడు...