కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఒకే రోజు, ఏకకాలంలో 8వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు ఆదిలాబాదు జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుండి హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అధికారులు ఆదిలాబాదు జిల్లా : రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” మహిళా వారోత్సవాల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు గ్రామ సంఘ భవనాల (ఇందిరాగాంధీ...