SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 1:45 am Posted by : SALAM PRODDATUR

ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు.. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి– రాకెట్ రఫీ

సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):

:భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 14తో ముగియాల్సిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో, మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మైదుకూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాకెట్ రఫీ కోరారు.

 

మంగళవారం సాయంత్రం మైదుకూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఓటరు తమ పేర్లు ఓటర్ల జాబితాలో సరిగా నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.

 

ఓటర్ల నమోదు, సవరణలు, చిరునామా మార్పులు, ఇతర వివరాల సరిదిద్దడం వంటి ప్రక్రియలను సంబంధిత బీఎల్‌ఓలతో (BLOలు) సమన్వయం చేసుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటును కాపాడుకోవడం బాధ్యతగా భావించి ఎన్నికల సంఘం కల్పించిన అదనపు గడువును తప్పకుండా వినియోగించుకోవాలని రాకెట్ రఫీ పిలుపునిచ్చారు.