SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 7:58 am Posted by : SALAM PRODDATUR

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిని విస్తరన

సలాం ప్రొద్దుటూరు (ఎన్టీఆర్):

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిని విస్తరించింది. కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్న పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, ఆత్కూరు, ఉంగుటూరు, ఉయ్యూరు టౌన్, ఉయ్యూరు రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో విలీనం చేసింది. దీంతో ప్రస్తుతం 28 పోలీస్ స్టేషన్లు ఉన్న కమిషనరేట్ పరిధి 37 పోలీస్ స్టేషన్లకు పెరిగింది. ఈ నిర్ణయంతో విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో పోలీసింగ్, శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.