ఉల్లి–వెల్లుల్లి – ఆహారమా, ఆచారమా, స్వేచ్ఛా?
- –భూమిపుత్ర శ్రీహరిమూర్తి.,రచయిత, పర్యావరణవేత్త సలాం ప్రొద్దుటూరు: మనిషి చరిత్రలో కొన్ని విషయాలు తరతరాలుగా కొనసాగుతూ సమాజపు స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. భాష, సంస్కృతి, కళలు, ఆచారాలు ఎంత ముఖ్యమో, ఆహారం కూడా అంతే ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. ఒక ప్రాంతపు వాతావరణం, వ్యవసాయ సంపద, జీవనశైలి, ఆధ్యాత్మిక భావనలు కలిసి అక్కడి ఆహార సంస్కృతిని రూపొందిస్తాయి. అందుకే ఆహారం గురించి జరిగే ప్రతి చర్చ సమాజపు లోతైన విలువలను స్పృశిస్తుంది. ఇటీవలి కాలంలో ఉల్లి, వెల్లుల్లి అంశం మళ్లీ...